ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి (2)
చందమామ చల్లగ మత్తుమందు చల్లగా ఆ
చందమామ చల్లగ పన్నీటిజల్లు చల్లగా (ఎంత హాయి)
ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా
ఒకరి చూపులొకరిపైన విరితావుల వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయింపగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవశించగా (ఎంత హాయి)
కానరాని కోయిలలు మనల మేలుకొల్పగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధురభావ లాహిరిలో మనము తూలిపోవగా
మధురభావ లహరిలో మనము తేలిపోవగా (ఎంత హాయి)
No comments:
Post a Comment