చందురుని మించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టముల నీడ కరగి పోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే .. (౨)
అన్న ఒడిజేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా, నాటి కథ పాడనా
కలతలకు లొంగి కష్టముల కృంగు నేటి కథ పాడనా, కన్నీటి కథ పాడనా
కలతలకు లొంగి .. కష్టముల కృంగు .. కన్నీటి కథ పాడనా
కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే, చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసె వెతలలో ద్రోసె మిగిలెనీ శోకమే, మిగిలెనీ శోకమే
విధియె విడదీసె .. వెతలలో ద్రోసె .. మిగిలెనీ శోకమే
(చందురుని మించు)
మనసులను కలుపు మధురబంధాలు మాసిపోరాదులే
తిరిగి నీవైన మామగారింట మనువునే కోరుమా
బంధమే నిల్పుమా, మా బంధమే నిల్పుమా
కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా
పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ జేరుమా
బంధమే నిల్పుమా, మా బంధమే నిల్పుమా
దివిలో తారకలు, భువిలో మానవులు ధూళిలో కలసినా
అన్నచెల్లెళ్ళ జన్మబంధాలు నిత్యమై నిలుచులే
లాలి పాపాయి, హాయి పాపాయి, లాలి పాపాయి జోజో, లాలి పాపాయి జోజో
No comments:
Post a Comment