నీకూ నీ వారు లేరు
నాకూ నా వారు లేరు
ఏటి వడ్డునా ఇల్లు కడదము
పదరా చల్ మోహనరంగా!
నీకు నాకూ జోడు కలసెను
గదరా ఛల్ మోహనరంగా!
మరుమల్లీ తోటలోన
మంచినీళ్ళ బావి కాడ
వుంగరాలు మరిచి వస్తిని
గదరా ఛల్ మోహనరంగా!
కంటీకి కాటుకెట్టి
కడవా సంకానబెట్టి
కంటినీరు కడవ నింపితి
గదరా ఛల్ మోహనరంగా!
గట్టు దాటి పుట్ట దాటి
ఘనమైన ఊరు దాటి
అన్నీ దాటి అడవి బడితిమి
గదరా ఛల్ మోహనరంగా!
నీకు నాకు జోడు అయితే
మల్లె పూల తెప్ప గట్టి
తెప్ప మీదా తేలి పోదాము
పదరా ఛల్ మోహనరంగా!
అదిరా నీ గుండెలదురా
మధురా వెన్నెల రేయి
నిదుర కు రమ్మంటిని
కదరా ఛల్ మోహనరంగా!
No comments:
Post a Comment