నిలువుమా నిలువుమా
నిలువుమా నిలువుమా నీలవేణి
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ ... (నిలువుమా నిలువుమా)
అడుగడున ఆడే లే నడుము సొంపులా (2)
తడబడే అడుగుల నటనల మురిపింపుల (2)
సడిసేయక ఊరించే
సడిసేయక ఊరించే .. వయ్యారపు వొంపుల
కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపులా
నడచిరా నడచిరా నాగవేణి
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ (నిలువుమా నిలువుమా)
అద్దములో...
అద్దములో...నీ చెలువు తిలకింపకు
ప్రేయసీ అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి (2)
నా ఊర్వశి రా వే రావేయని పిలువనా (2)
ఆ సుందరి నెఱనీకు నీగోటికి సమమౌనా
రాచెలీ నినుమదీ దాచుకోనీ (2)
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ (నిలువుమా నిలువుమా)
No comments:
Post a Comment