నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి
నిన్నే నా సామి (నన్ను దోచుకుందువటె)
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన (2)
పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె
ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు (2)
కలకాలము వీడని సంకెలలు వేసినావు
సంకెలలు వేసినావు (నన్ను దోచుకుందువటె)
నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై (2)
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం (2)
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం (నన్ను దోచుకుందువటె)
No comments:
Post a Comment