Friday, November 27, 2009

ఈ నల్లని రాళ్ళలో ....::చిత్రం ; అమరశిల్పి జక్కన

ఈ నల్లని రాళ్ళలో ఎ కన్నులు దాగెనో

ఈ బండల మాటున ఎ గుండెలు మ్రోగెనో ఓ... ఈ నల్లని రాళ్ళలో


పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి

పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి

మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి


ఈ నల్లని

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు

ఉలి అలికిడి విన్నంతనే

ఉలి అలికిడి విన్నంతనే జల జలమని పొంగి పొరలు


ఈ నల్లని


పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును

పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును

జీవమున్న మనిషికన్నా శిలలే నయమని పించును


ఈ నల్లని

No comments: