ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను జేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
!! ఆకాశ వీధిలో !!
జలతారు మేలి మబ్బు పరదాలు వేసి తెరచాటు చేసి
పలుమార్లు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి
అందాల చందామామ దొంగాటలాడెనే దోబూచులాడెనే
!! ఆకాశ వీధిలో !!
జడివాన హోరుగాలి సుడిరేగి రానీ జడిపించ బోని
కలకాలము నీవే నేనని పలుబాసలాడి చెలిచెంత చేరి
అందాల చందామామ అనురాగం చాటెనే నయగారం రేపెనే
!! ఆకాశ వీధిలో !!
No comments:
Post a Comment