Friday, May 16, 2008

హోగేనకల్ ..








చిత్తూరు జిల్లా కుప్పం దగ్గర తమిళనాడు లోనిధర్మపురి జిల్లా లో హొగెనెకల్ అనే జలపాతాలున్నాయి..బెంగుళూరు నుండి చెన్నై పోయే రెండో దారి అంటేకృష్ణగిరిమీదుగా పోయే దారిలో ఉంది. . ఇక్కడ కావేరీ నదీపాయ కొండలలో సుడులు తిరుగుతూ అనేక చోట్ల జలపాతాలు సౄష్టించి..కనువిందు చేస్తుంది. ఈ జలపాతాల హోరులోజోరులో కొండరాళ్ళు పొగలు చిమ్ము రాళ్ళుగా అగుపడుతుంటుంది.అందుకే ఆ పేరు హొగు అంటెకన్నడాలో పొగ..ఈ నది ఇక్కడ ప్రవేశించకముముదే ఓ దట్టమైన అరణ్యంలో అనేక మూలికల వేర్ల మీదుగా ప్రవహిస్తూ వస్తుంది అందుకె ఈ నీటికి చలాఔషధ గుణలుంటాయంటారు.ఉండటాంకి వసతులున్నాయి..చుట్టూ మాలిష్ చేసేవాళ్ళుంటారు..కావాలంటే దొన్నెల పై తీసుకెళతారు..చాలా గగుర్పాటు కలిగిస్తుంది.రకరకాల చేపలు అప్పటికప్పుదు కాల్చి ఇస్తారు.

ఓ సారి స్నానం చేస్తే చలు మళ్ళీ మరచిపోని అనుభూతి కలిగిస్తుంది...

బెంగుళూరు నుంచి 140 కి.మీ ..ఉండటానికి కర్ణాటకా టూరిజం వారి వసతిగృహాలు..హోటల్ తమిల్ నాడు ఉన్నాయి.దొన్నెలపై జలవిహారం మరచిపోకండి..

1 comment:

Unknown said...

కర్నాటకలోనే కాదు, తమిళ్ నాడులో కూడా ధర్మపురి ఒకటి ఉందన్నమాట.
చాలా బాగుంది నాయక్ జీ !
:)