అదే.. అదే.. అదే... నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగు చున్నది (అదే)
అదే అదే అదే......
అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అహా హ హ అహా హ హ అహా
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసు లోన ఉన్నది (అదే)
నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి (నీ)
ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉన్నవి (౨)
ఈ వేళ నా పెదవులేల వణుకుచున్నవి (అదే)
నీ చేయి సోకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను (నీ)
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను (౨)
ఈ వేళ లేత బుగ్గలేల కందిపోయెను (అదే)
No comments:
Post a Comment