మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది … పొదరిల్లు మాది
నేనైతే ఆకూ కొమ్మా …. తానైతే వెన్నెల వెల్ల

పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది
మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది … పొదరిల్లు మాది
కోవెల్లో వెలిగే దీపం దేవీ మా తల్లీ
కోవెల్లో తిరిగే పాటల గువ్వా నా చెల్లీ
గువ్వంటే గువ్వాకాదు గొరవంక గానీ
వంకంటే వంకా కాదు నెలవంకా గానీ
మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది … పొదరిల్లు మాది
గోరింకా పెళ్ళైపోతే … ఏ వంకో వెళ్ళిపోతే
గోరింకా పెళ్ళైపోతే … ఏ వంకో వెళ్ళిపోతే
గూడంతా గుబులైపోదా గుండెల్లో దిగులైపోదా
మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది … పొదరిల్లు మాది
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది … పొదరిల్లు మాది
No comments:
Post a Comment