Friday, February 15, 2008

హర్స్లి కొండలు ..ఆంధ్ర ఊటి







తిరుపతికి దాదాపు 140 కి.మీ దూరంలో ఉన్న చల్లని కొండ ప్రదేశము హార్స్లీ కొండలు.సముద్రమట్టానికి 1265 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బ్రిటిష్ కాలం నాటి కడప కలక్టరు ' హార్స్లీ ' తన వేసవి విడిదిగా ఉపయోగించుకుంటూ ఇక్కడా అభివృద్దిచేసాడని చెబుతారు. ఇక్కడ చాలా చల్లగాఉంటుంది.ఇక్కడివారు ఆంధ్రా ఊటీ అంటుంటారు పెద్ద విస్తీర్ణము లేకున్నా ఇప్పుడిప్పుడే టూరిజం వాళ్ళు ఒకటి రెందు హోటళ్ళు,విశ్రాంతిభవనాలు నిర్మించారు..ఇక్కడికొస్తే కుటుంబంతో గాని స్నేహితులతో గాని కలిసేరావాలి లేకుంటే సరదా ఉండాదు.చూట్టానికి ప్రత్యేకంగా ఏమీ లేదు.వాతావరణం హాయిగా ఉంటుంది.మేఘాలు మిమ్ము ఒరుసుకుంటూ పోతుంటాయి. పెద్ద పెద్ద లోయలు అంచుదాకా వెళితే గుండెలవిసిపోతాయి.దారిపొడుగునా సంపంగి చెట్లు ఆహ్వానం పలుకుతాయి.ఇవే కాక యూకలిప్టస్,గుల్మొహర్ చెట్లు కూడా బాగా పెరుగుతాయి. జిడ్డుకృష్ణమూర్తి ఫౌండేషన్ తో నడపబడే రిషీ వేలీ ఇక్కదికి దగ్గరే..మొత్తం కొండ ఓ అరగంటలో చుట్టిరావచ్చు. కేవలం స్వంతవారితో కలిసి గడాపడానికే రావాలి. పిల్లల కోసం ఓ చిన్న జంతుప్రదర్శనశాల ఉంది. ఇక్కడే ఏనుగుమల్లమ్మ గుడి ఉంది చెంచుదేవత.జనసాంద్రత తక్కువ.నిశ్శబ్దంగా ఉంటుంది.

బెంగుళూరు నుంచి 150 కి.మీటర్లు మదనపల్లె వచ్చి అనంతపూర్ రోడ్డెక్కాలి.

ఫారెస్ట్ వాళ్ళ గెస్ట్ హౌజ్ ఉంది..ఇది చిత్తూరు ఫారెస్ట్ ఆఫీసర్ ని అడగాలి. ఇకపోతే మన టూరిజంవాళ్ళవి కూడా ఉన్నాయి.. భోజనం ముందే చెప్పాలి ఓ రెండుగంటలలొ రెడీ చేస్తారు..

ఫోను నంబర్లు :08571 - 279323 .,279324.,

ఇక్కడికి 85 కి.మీ లదూరంలో కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంక్చ్యుయరీ ఉంది.






ఇంకేం ప్రయాణ ఏర్పాట్లు చేయం ది

...

2 comments:

పద్మ said...

మేమీ ఊరు వెళ్ళాంగా. :) ఇండియాలో వర్క్ చేసేటప్పుడు మొత్తం ఆఫీస్ వాళ్ళం వెళ్ళాం. బాబోయ్. ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేశాం. రిషీవ్యాలీ స్కూల్ చూశాం. అంతా బానే ఉంది కానీ తలకోన ట్రెక్కింగ్ మటుకు కుదరలేదు. :(

vinayakam said...

avunA ..mEmeLLIna rOjullO memE vamTachEsukunE vALLam..shooting jarigitE urike vALLam...