Tuesday, February 12, 2008

ఓ బంగరు రంగుల చిలకా..పలకవా..

ఓ బంగరు రంగుల చిలకా..పలకవా..
ఓ అల్లరి చూపుల రాజా..ఏమనీ..
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ..
ఓ అల్లరి చూపుల రాజా..పలకవా..
ఓ బంగరు రంగుల చిలకా..ఏమనీ..
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ..

పంజరాన్ని దాటుకునీ..బంధనాలు తెంచుకునీ..
నీ కోసం వచ్చా ఆశతో..
మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా..
నిరుపేదను వలచావెందుకే..
నీ చేరువలో..నీ చేతులలో పులకించేటందుకే..
ఓ బంగరు రంగుల చిలకా..పలకవే..
ఓ అల్లరి చూపుల రాజా..ఏమనీ..
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ..

సన్నజాజి తీగుంది..తీగ మీద పువ్వుంది..
పువ్వులోని నవ్వే నాదిలే..
కొంటె తుమ్మెదొచ్చింది..జుంటి తేనె కోరింది..
అందించే భాగ్యం నాదిలే.. ఈ కొండల్లో..ఈ కోనల్లో
మనకెదురేలేదులే..
ఓ అల్లరి చూపుల రాజా..పలకవా..
ఓ బంగరు రంగుల చిలకా..ఏమనీ..
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ.

No comments: