Tuesday, February 5, 2008

మంటలు రేపే నెలరాజా

మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా …

వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి
మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా …

ఆకాశానికి అంతుంది .. నా ఆవేదనకూ అంతేది
ఆకాశానికి అంతుంది .. నా ఆవేదనకూ అంతేది
మేఘములోన మెరుపుంది నా జీవితమందునా వెలుగేదీ ..
మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా

తీగలు తెగిన వీణియపై ఇకపై తీయని రాగం పలికేనా

ఇసుక ఎడారిని ఎపుడైనా ఒక చిన్న గులాబి విరిసేనా
మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా

మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు

సుఖము శాంతి ఆనందం నా వొసటను రాయుట మరిచాడు
మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా

చిత్రం : రాము
గాత్రం : ఘంటసాల

No comments: