Thursday, February 21, 2008

మధువలక బోసే ఈ చిలిపి కళ్ళూ

మధువలక బోసే
ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ
మధువలక బోసే
ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ
మధువలకబోసే ఈ చిలిపికళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ
అడగకనే ఇచ్చినచో
అది మనసుకందమూ
అనుమతినే కోరకనే
నిండేవు హౄదయమూ
తలవకనే కలిగినచోఅదిప్రేమ బంధమూ
బహుమతిగా దోచితివీ
నాలోని సర్వమూ
మనసు మనసుతో...ఊసులాడనీ
మూగభాషలో..బాసచేయనీ
ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీమధువలకబోసే ఇ చిలిపికళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ
గగనముతో కడలి చెలి పలికినది ఏమనీ
తలపులకు..వలపులకు..సరిహద్దులేదనీ
కుసుమముతో ఆభ్రమరం తెలిపినది ఏమనీ
జగమునకు మనచెలిమి ఆదర్శ్యమౌననీ
కలలు తీరగా...కలిసి పొమ్మనీ
కౌగిలింతలో...కరిగి పొమ్మనీ
ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ
మధువలకబోసే...హా
ఈ చిలిపి కళ్ళూ...ఆ
అవి నాకు వేసే..ఆ.
బంగారు సంకెళ్ళూ.

చిత్రం : కన్నవారి కలలు
గానం : వి.రామకృష్ణ, పి.సుశీల

No comments: