ఓ నిండు చందమామ … నిగనిగల భామ
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామ
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు
మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు
ఏలుకునే ప్రియుడను కానా నాలించగ సరసకు రానా
ఓఓఓఓఓ… ఓ నిండు చందమామ … నిగనిగల భామ
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామ
దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడతాయే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడతాయే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నేటినుంచి నేనులు రెండూ నెరజాణా ఒకటాయే..
ఓఓఓఓఓ… ఓ నిండు చందమామ … నిగనిగల భామ
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామ
చిత్రం : బంగారు తిమ్మరాజు
గాత్రం : కె.జె.యేసుదాస్
పదం : ఆరుద్ర
స్వరం : S.P. కోదండపాణి
No comments:
Post a Comment