చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ
మొన్న పున్నమి రాతిరి
నీవొడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ..
గొల్లుమన్నాము //చక్క//
మబ్బు మబ్బు మాటున
ఈ మసక చీకటి చాటున
బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ..
వెతుకుతున్నామూ //చక్క//
దారి తప్పి పోతివో
నీ వారి సంగతి మరచినావో
ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో..
రాలేకవున్నావో... //చక్క//
చిత్రం : భార్యాబిడ్డలు
గానం : పి.సుశీల
No comments:
Post a Comment