నీ కురులు
ఎంత చక్కని సృష్టి
అందుకె పూలు ఇక్కడే
ఊసులాడుకుంటాయి
ఎంత చక్కని సృష్టి
అందుకె పూలు ఇక్కడే
ఊసులాడుకుంటాయి
0--0
తడిసినా , తుడిచినా
ముడిచినా ,జార విడిచినా
భాష్యాలే అందానికి
అందుకే చిరుగాలి
నీతోనే ఆటలు
0--0
ముందు పడి ఓల లాడుతూ
వెనక చేరి డోల లాడుతూ
వాలుగా దూకి వంపులు తిరిగి
ఉరికే కృష్ణ పాతం
0--०
పచ్చిక లా పరచితే
పవ్వళించాలని ఉంది
కొరడా లా ఝళిపించితే
ఏ శిక్షకైనా సిద్దమే
0--0
జీరాడు ముంగురులలో
చిక్కు ముడినై
రెండుగా చీలినా
మూడు పాయలైనా
అల్లికల మధ్య దూరైనా
అంటి పెట్టుకునే ఉండిపోతా
0--0
నే జారకుండా
జడకుచ్చులు
పెట్టుకోవా........
No comments:
Post a Comment