Sunday, February 3, 2008

శ్రీకాళహస్తి SrikAlahasthi..


శ్రీకాళహస్తి తిరుపతికి 35 కి.మీ దూరం లో స్వర్ణముఖి నదీ తిరాన వెలసి ఉంది. శ్రీ అంటే సాలెపురుగు ,కాళ అంటె పాము హస్తి అంటె ఏనుగు కథ అందరికీ తెలిసిందే అందుకే అవి వదిలి గుడి వివరాలు చెబుతాను.ఈ మధ్య ఈ దేవాలయం రాహు కేతు సర్పదోష నివారనకు పేరు మోసింది.ఈ పూజ రోజూ రాహుకలం లో జరుగుతుంది.ఇక్కడికి రాగోరు వారు ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. లేకుంటే ఒక్క రోజు వ్యర్థమయ్యే ప్రమాదముంది.ఈ పూజ కు 3 రకాల రుసుములున్నాయి.250/ ఇస్తే మూకుమ్మడిగా ఒకే అర్చకుని ఆధ్వర్యం లో చేసుకోవచ్చు.600 కడితె చిన్న చిన్న గుంపులుగా చేసుకో వచ్చు. 1500/ కడితె గుడిలోపల ప్రత్యేక అర్చకునితో చేసుకునే వీలుంటుంది. పూజా సామగ్రి అంతా వాళ్ళే ఇస్తారు.

ఇక గుడి గురించి: ఈ గుడి 1 వ శతాబ్దంలో ప్రారంభించబడి..ఆ తరువాత చోళులు ,పల్లవులు ,విజయనగర రాజులు ఇలా అంచెలంచలుగా రినొవేట్ చేయబడింది.కన్నప్ప కోసరం ఓ ప్రత్యెక గుది కొండ పైన.

శ్రీకాళహస్థికి రైల్వే స్టేషన్ ఉంది.దగ్గర తిరుపతి విమానాశ్రయము.తిరుపతి నుంచి బస్సులు ,జీపులు ,కార్లు ,వేన్లు తిరుగుతునే ఉంటాయి.ఇది దక్షిణ కైలాసం గా వన్నెకెక్కిన స్థలం..

ఫోను : 08578 - 221655ఇ.వో. :08578 - 221140

No comments: