ఇదో అద్భుతమైన సాహిత్యం కల పాట..పి.బి.శ్రీనివాస్ కూడా అద్భుతంగా పాడారు.ప్రతి చరణము నిత్య జీవిత సత్యమే..మొదట్లో నెంజిల్ ఓర్ ఆలయం అని వచ్చిన తమిళ సినిమాఅదే సినిమా తెలుగులో మనసే మందిరం అని తీసారు..
మీరూ వినండి..
...........................................................
..........................................................
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
ముగిసిన గాధ మొదలిడదు దేవుని దర్శనలతో
మొదలిడు గాధ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
మనసున కెన్నో మార్గాలు కనులకు ఎన్నో స్వప్నాలు
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు
మనసున కెన్నో మార్గాలు కనులకు ఎన్నో స్వప్నాలు
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు
ఎదలో ఒకరే కుదిరిన నాడు మనసే ఒక స్వర్గం
ఒకరుండగ వేరొకరొచ్చారా లోకం ఒక నరకం
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
ప్రేమ పవిత్రం పెళ్ళి పవిత్రం ఎది నిజమౌ బంధం
ఎది అనురాగం ఎది ఆనందం బ్రతుకున కేది గమ్యం
మంచి చెడు మారేదే మనదన్నది మాటే ఇదే
ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
No comments:
Post a Comment