నేను కాలేజి ఫైనల్ యియర్ చదివే రోజుల్లోది ఈ సినిమా...
ఈ పాట డెస్క్ లపై డప్పు కొట్టటానికి భలే పనికొస్తుంది..
ఇక డ్యాన్సులు ,స్టెప్పులు సరేసరి.. :))
ఎన్నిసార్లు పాడించారో అప్పుడు...
--------------------------
పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
కన్నెగానె బతుకు గడిచిపోతుంది
నన్నెవరేలుకుంటారో అనుకున్నది
జానకి అనుకున్నది శ్రీరామచంద్రుడె చేసుకుంటాడని
విన్నదీ ఒళ్లంతా ఝల్లన్నదీ
నవ మన్మధుని వంటి నాధుని కనులారా
ఒక్కసారి చూడగ వుబలాటపడ్డది
తుమ్మెదా వుబలాటపడ్డది
పెళ్ళి పీటల మీద వెళ్ళి కూర్చున్నది
కళ్లలో.. కాని సిగ్గు కమ్మేసింది
ఓయమ్మా బుగ్గలకుపాకింది
నీ గుండెలోన నేనుండిపోవాలి
నీ అండనే నేను పండిపోవాలి
నా నోముపంట పండాలి
రాముడే రాముడు .. జానకే జానకని
ముందు వెనకందరూ .. మురిసిపోవాలని
జానకి మొక్కుతూ మొక్కుకుంది...
చిత్రం : అక్కా చెల్లెలు
గానం : పి.సుశీల
No comments:
Post a Comment