బ్రతుకంతా బాధగా
కలలోని గాధగా
కన్నీటి ధారగా
కరిగిపోయే
తలచేది జరుగదు - జరిగేది తెలియదు
బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుకా (౨)
గారడి చేసి గుండెను కోసి
నవ్వేవు ఈ వింత చాలిక (బొమ్మను)
అందాలు సృష్టించినావూ
దయతో నీవు మరలా నీ చేతితో నీవె తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే
గాఢాంధకారాన విడిచేవులే
కొండంత ఆశ అడియాస చేసి
పాతాళలోకాన త్రోసేవులే (బొమ్మను)
ఒకనాటి ఉద్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగమధువు అందించి నీవు
హాలాహలజ్వాల చేసేవులే
ఆనందనౌక పయనించు వేళ
శోకాలసంద్రాన ముంచేవులే (బొమ్మను)
2 comments:
aenti saaruu ekkaDaa kanipinchakunDaa unnaaru
అక్కడెక్కడో సముద్రం లో కేబుల్ దెబ్బతిని రిలయన్స్ కనెక్షన్స్ దెబ్బతిన్నాయట కదా..
మా వాడు ఓ వారం నెట్ రాదన్నాడు మరి..:(
Post a Comment