Wednesday, November 5, 2008

మనసు పరిమళించెనే ...

మనసు మరిమళించెనే తనువు పరవశించెనే
నవవసంతరాగముతో నీవు నటన చేయగనే
మనసు మరిమళించెనే తనువు పరవశించెనే
నవవసంతగానముతో నీవు చెంత నిలువగనే
మనసు
నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా 2
గలగల సెలయేరులలో కలకలములు రేగగా
మనసు
క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా 2
భ్రమరమ్ములు గుబులు గుబులుగా ఝుంఝుమ్మని పాడగా
మనసు
తెలిమబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా 2
రంగరంగ వైభవములతో ప్రకృతి నిను చేరగా
మనసు

No comments: