సాగేను జీవిత నావ .. తెరచాప లేక ఈ త్రోవ
దరిజేర్చు దైవము నీవే .. నా ఆశ దీర్చ రావే ..
సాగేను జీవిత నావ
మనసంత నీకు మందిరముగా మమతలే పూమాలగా
మనసంత నీకు మందిరముగా మమతలే పూమాలగా
కానుకగా అర్పించలేనా … కానుకగా అర్పించలేనా
కలకాలం పూజించనా …
సాగేను జీవిత నావ .. తెరచాప లేక ఈ త్రోవ
దరిజేర్చు దైవము నీవే .. నా ఆశ దీర్చ రావే ..
సాగేను జీవిత నావ
కనులార నిన్ను గాంచినంత కలలన్ని సత్యమౌనులే ..
కనులార నిన్ను గాంచినంత కలలన్ని సత్యమౌనులే ..
కనికరమే నా పైన రాదా .. కనికరమే నా పైన రాదా
నా తపసే ఫలించదా …
సాగేను జీవిత నావ .. తెరచాప లేక ఈ త్రోవ
దరిజేర్చు దైవము నీవే .. నా ఆశ దీర్చ రావే ..
సాగేను జీవిత నావ
చిత్రం తోబుట్టువులు
గాత్రం ఘంటసాల, సుశీల
No comments:
Post a Comment