పూవులు పూయును పదివేలు…భగవానుని మెడలో ఎది వ్రాలు

ప్రాణములున్నవి అందరికీ … ప్రణయము తెలిసే దెందరికి

అరుదైన వరం మన జీవితము …ఆనందానికే అది అంకితము

అఱ చేతనె ఉన్నది స్వర్గమురా ….. అఱ చేతనె ఉన్నది స్వర్గమురా
అది ఎఱుగని వారిదే నరకమురా ..
పూవులు పూయును పదివేలు…భగవానుని మెడలో ఎది వ్రాలు
చేజారినదీ నిన్నటి దినము .. జనియించనిదీ రేపటి దినము

అవి అందనివీ మన కెందుకురా .. అవి అందనివీ మన కెందుకురా
ఈ దినమే మనదనుకుందామురా ..
పూవులు పూయును పదివేలు…భగవానుని మెడలో ఎది వ్రాలు
ప్రాణములున్నవి అందరికీ … ప్రణయము తెలిసే దెందరికి
పూవులు పూయును పదివేలు…భగవానుని మెడలో ఎది వ్రాలు
చిత్రం : గురువుని మించిన శిష్యుడు
గాత్రం : S. జానకి
A good song from Vittalacharya films
No comments:
Post a Comment