Tuesday, February 12, 2008

తనివి తీరలేదే

తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
చెలియా ఓ చెలియా
ఎన్నో వసంత వేళలలో
వలపుల ఊయలలూగామే
ఎన్నో పున్నమి రాత్రులలో
వెన్నెల జలకాలాడామే
అందని అందాలా అంచుకే చేరిననూ
విరిసినా పరువాలా లోతులే చూసిననూ
తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా

ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి
కన్నుల నీవే కనపడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి
వెచ్చనీ కౌగిలిలో హాయిగా కరిగించిననూ
తీయనీ హ్రుదయంలో తేనెలే కురిపించిననూ
తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం

No comments: