నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
నింగీ నేలా ఒకటాయెలే
ఇన్నాళ్ళ ఏడబాటు నేడే తీరెలే
నా వెంట నీవుంటే ఎంతో హాయిలే
హౄదయాలు జత జేరి ఊగే వేళలో
దూరాలు భారాలు లేనే లేవులే
నీవే నేను లే ...నేనే నీవు లే
నింగీ నేలా ఒకటాయెలే
రేయయినా పగలైన నీపై ద్యానము
పలికింది నాలోన వీణా గానము
అధరాల కదిలింది నీదే నామము
కనులందు మెదిలింది నీదే రూపము
నీదే రూపమూ ... నీవే రూపము
నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
సినిమా :: పూజ
No comments:
Post a Comment