Friday, February 29, 2008

మధుర భావాల సుమమాల

మధుర భావాల సుమమాల మనసులో పూసే ఈ వేళ
పసిడి కలలేవో చివురించి ప్రణయ రాగాలు పలికించే
ఎదను అలరించు హారములో పొదిగితిని ఎన్నెన్ని పెన్నిధిలో
మరువరాని మమతలన్ని
మెరిసిపోవాలి కన్నులలో //మధుర//
సిరులు తులతూగు చెలిమికైనా కరుణ చిలికేవు నాపైన
కలిమికన్నా చెలిమి కన్న
కలవు మణులెన్నో నీలో //మధుర//
ఒకే పడవందు పయనించే
ఒకే గమ్యము ఆశించి
ఒకే మనసై ఒకే మనువై
ఆ ఉదయశిఖరము చేరితిమి //మధుర//
చిత్రం : జైజవాన్
గానం : ఘంటసాల, పి.సుశీల

No comments: