అంతగా నను చూడకు … ష్… మాటాడకు
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను..
చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను
తలుపులే కవ్వించెను ..వలవుల వీణలు తేలించెను
అంతగా నను చూడకు … ష్… మాటాడకు
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను
జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను … పదునౌ చూపులు బాధించెను
హోయ్ అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
వాలుగ నిన్నే చూడనీ .. కలకాలము నీలో దాగనీ ..
వాలుగ నిన్నే చూడనీ .. కలకాలము నీలో దాగనీ
నవ్వులే పండించనీ .. పువ్వుల సంకెల బిగించనీ ..
హోయ్ అంతగా నను చూడకు .. ష్ .. మాటాడకు
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
చిత్రం మంచిమనిషి
గాత్రం ఘంటసాల, సుశీల
No comments:
Post a Comment