Saturday, February 16, 2008

తొండవాడ .. తిరుపతి దగ్గర


.. శ్రీ అగస్త్యులవారు తపస్సు చేసిన స్థలం ...
యాత్రికుల కోసం మరో మజిలీ
తిరుపతి నుంచి కాణిపాకం పోయే దారిలో 12 కి.మీటర్ల దూరంలో స్వర్ణముఖీ నదీ తీరాన
తొండవాడ అనే గ్రామం ఉంది.మామూలుగా కాణిపాకం పోయేవారందరూ ఈ రోడ్డమ్మటే వెళ్ళాలి
కానీ ఆగకుండా వెళ్ళిపోతారు. అందుకే ప్రత్యేకంగా చెబుతున్నా..
ఈ ప్రదేశాన్నే ముక్కోటి అని పిలుస్తారు. ఇక్కడ 3 పుణ్యనదులు కలుస్తాయి.
అవి స్వర్ణముఖి ,భీమా ,కళ్యాణి .. ఇక్కడి లింగాన్ని అగస్తీశ్వరమహాముని స్థాపించారు కబట్టి
అగస్తీశ్వరలింగం గా ప్రఖ్యాతి.చాలా ప్రాచీనసాంప్రదాయ కట్టడము.పక్కనే చిన్న కోనేరు.
నదీమధ్యలో ఓ మండపము.పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందనటంలో సందేహం లేదు.
ఇంకా నాగరికత ఇక్కడ చేతులు చాచలేదు కాబట్టి కలుషితంకాలేదు. అగస్థీశ్వరులవారు తపస్సు చేసిన వృక్షం ఇక్కడి హై లైట్.
ఈ చెట్టు అయిదు వృక్షలసముదాయం.
అప్పటి చంద్రగిరిరాజులు ఇక్కడ ఏనుగులు బంధించేవారట..అందుకే తొండవాడ అనిపేరు.
ఈ స్థల చూట్టానికి చక్కగా ఉంటుంది.నదీతీరం..కోనేరు , ఆలయం , మహా వట వృక్షం..
ఆనాటి కట్టడాలు..ఓ సారి చూడవలసిందే..

No comments: