అమ్మ కడుపు చల్లగా
అత్త కడుపు చల్లగా
బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా
నా మెడలో తాళిబొట్టు కట్టరా నా నుదట నిలువు బొట్టు పెట్టరా
నీ పెదవిమీద సిరునవ్వు సెరగదురా
నీ సిగపూవుల రేకైనావాడదురా వాడదురా
బతకరా బతకరా పచ్చగా //అమ్మ//
చల్లని అయితేణికి మొక్కరా సన్నికల్లు మీదకాలు తొక్కరా
చల్లవేళ కంటనీరు వద్దురా నా నల్లపూసలే నీకు రక్షరా రక్షరా
బతకరా బతకరా పచ్చగా //అమ్మ//
నా కొంగు నీ చెంగూ ముడివేయరా
నాచేయి నీ చేయి కలపరా
ఏడడుగులు నాతో నడవరా
ఆ యముడైనా మనమద్దికి రాడురా రాడురా
బతకరా బతకరా పచ్చగా //అమ్మ//
చిత్రం : సాక్షి
గానం : పి.సుశీల
No comments:
Post a Comment