నిదురపో .. నిదురపో .. నిదురపో ..
నిదురపో .. నిదురపో .. నిదురపో ..
నిద్దురపోరా తమ్ముడా నిద్దురపోరా తమ్ముడా
నిదురలోనా గతమునంతా నిముషమైనా మరచిపోరా
నిదురలోనా గతమునంతా నిముషమైనా మరచిపోరా
కరుణలేని ఈజగానా కలతనిదురే మేలురా నిద్దురపోరా తమ్ముడా
కలలుపండే కాలమంతా కనులముందే కదలిపోయే
కలలుపండే కాలమంతా కనులముందే కదలిపోయే
లేతమనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే
లేతమనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే నిద్దురపోరా తమ్ముడా
జాలితలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే
జాలితలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే
చితికిపోయిన జీవితమంతా ఇంతలో చితిఆయే
నీడజూపి నిలవుమనకూ నిదురయేరా తమ్ముడా నిద్దురపోరా తమ్ముడా
No comments:
Post a Comment