Saturday, May 3, 2008

వాడిన పూలే వికసించినే

వాడిన పూలే వికసించెనే (౨)

చెర వీడిన హృదయాలు పులకించెనే (వాడిన)

తీయని కలలే ఫలియించెనే (౨)

ఎల కోయిల తన గొంతు సవరించెనే (తీయని)



వేయి రేకులు విరిసింది జలజం

తీయ తేనియ కొసరింది భ్రమరం

లోకమే ఒక ఉద్యానవనము

లోటు లేదిక మనదే సుఖము (తీయని)



(పగలే జాబిలి ఉదయించనేలా?

వగలే చాలును పరిహాసమేలా?) (౨)

తేట నీటను నీ నవ్వు మొగమే

తేలియాడెను నెలరేనివలెనే (వాడిన)



జీవితాలకు నేడే వసంతం

చెదిరిపోవని ప్రేమానుబంధం

ఆలపించిన ఆనందగీతం

ఆలకించగ మధురం మధురం (వాడిన)




No comments: