


చిత్తూరు జిల్లా లో గుళ్ళు గోపురాలు .. చల్లని హార్స్లీ కొండలే కాదు ,మరెన్నో జలపాతాలే కాకుండా ..చారిత్రాత్మక కోటలు మహల్ లూ ఉన్నాయి.అందులో ఇప్పుడు చంద్రగిరి కోటగురించి చెప్పుకుందాం..ఇది తిరుపథి కేవలం 14 కి.మీటర్ల దూరంలో చిత్తూరు పోయే రహదారిలో ఉంది.కొండపై కట్టిన కోట పూర్తిగా శిధిలమైనా ఇంకా కందకం ప్రహారీ గోడలుజీర్ణావస్థలో దర్శనమిస్తాయి. ఇక్కడ చెప్పుకో తగ్గవి రాజా మహాల్ రాణీ మహల్ఇప్పుడు పర్యాటక శాఖ అధీనంలో కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి.ప్రత్యేక ఆకర్షణ సౌండ్ లైట్ షో.. సాయింత్రం 6 .30 నుండి ప్రారంభం.ఇంగ్లీషు లోనూ తెలుగులో నూ ఉన్నాయి.
ఇది విజయనగర రాజుల చిట్టచివరి ముఖ్యపట్టణం..11 వ శతాబ్ధం నాటిది ఈ కోట. స్వర్ణముఖీ నది తీరం.. ఇక్కడినుంచే తిరుమలకు నడక దారి ఉంది కానీ ఇప్పుడు వాడబడటం లేదు.
తిరుపతి లో రాత్రి మకాం చేసేవారికి..లేదా కాణిపాకం కారులో పోయేవారికిఇది ఒక అదనం. సాయంత్రాలలో అయితేనే లైట్ షో ఉంటుంది..
మరి కదలండి .....
1 comment:
మా నాన్న గారికి అలివేలుమంగాపురం టెంపుల్ అంటే చాలా అభిమానం. తిరుపతి కి వెళ్తే తప్పకుండా తీసుకువెళ్ళేవారు. ఆ రహదారిపై వెళ్తున్నప్పుడు ఈ చంద్రగిరి కోట కనిపించేది. కానీ, ఎప్పుడూ అక్కడకి వెళ్ళి చూడలేదు. ఈ సారి తప్పని సరిగా వెళ్దామనుకుంటున్నాను.
Post a Comment