Thursday, May 29, 2008

ధనమేరా అన్నటికీ మూలం

ధనమేరా అన్నటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నటికీ మూలం
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా
ధనమేరా అన్నిటికీ మూలం
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయారా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయారా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే ..
ధనమేరా అన్నిటికీ మూలం
కూలివాని చమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
కూలివాని చమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం
ధనమేరా అన్నటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నటికీ మూలం

No comments: