Tuesday, May 20, 2008

నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో

నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో
నిదుర లేచెనెందుకో
తెలియని రాగమేదో తీగసాగెనెందుకో
తీగసాగెనెందుకో
నాలో ....... (నిన్నలేని అందమేదో)

పూచిన ప్రతి తరువొక వధువు పువుపువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో
(నిన్నలేని అందమేదో)
తెలినురుగులె నవ్వులు కాగా సెలయేరులు కులుకుతు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే
(నిన్నలేని అందమేదో)

పసిడి అంచు పైటజార పయనించె మేఘబాల
అరుణకాంతి సోకగానే పరవశించెనే
(నిన్నలేని అందమేదో)

No comments: