Monday, May 12, 2008

నడిరేయి ఎ ఝాములో ..

నడిరేయి ఎ ఝాములో స్వామి నినుచేర దిగివచ్చునో

తిరుమల శిఖరాలు దిగి వచ్చునో ! నడిరేయి !!

మముగన్న మాయమ్మ అలివేలుమంగమ్మ

మముగన్న మాయమ్మ అలివేలుమంగమ్మ

పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ

స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ

విభునికి మామాట వినిపించవమ్మ

ప్రభువుకు మా మనవి వినిపించవమ్మ

ఏడేడు శిఖరాల నే నడవలేను

ఏ పాటి కానుకలందించలేను

వెంకన్న పాదాలు దర్శించలేను

నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా మముగన్న మాయమ్మ అలివేలుమంగా

మముగన్న మాయమ్మ అలివేలుమంగా

విభునికి మామాట వినిపించవమ్మ

ప్రభువుకు మా మనవి వినిపించవమ్మ
కలవారినేగాని కరుణించలేడా

నిరుపెదమోరలేవి వినిపించుకోడా

కన్నీటి బ్రతుకు లు కనలేనినాడు

స్వామికరుణామయుండన్న బిరుదేలనమ్మ

అడగవే మాతల్లి అనురాగవల్లి

అడగవే మాయమ్మ అలివేలుమంగా

నడిరేయి ఎ ఝాములో స్వామి నినుచేర దిగివచ్చునో

No comments: