Wednesday, May 7, 2008

అడగక ఇచ్చిన మనసే ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు

అం దిఅం దని అందమే ముద్దు

విరిసివిరియని పువ్వే ముద్దు

తెలిసితెలియని మమతే ముద్దు) (౨)

అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు (౨)

పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు (౨)

అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చక చక లాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకీ ముద్దు (౨)

కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు (౨)

అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

పచ్చని చేలే కంటికి ముద్దు, నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు (౨)

చెట్టు చేమా జగతికి ముద్దు, నువ్వు నేను ఊహుహుహూహు

చెట్టు చేమా జగతికి ముద్దు, నువ్వు నేను ముద్దుకు ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు

అమ్దీ అందని అందమే ముద్దు

విరిసివిరియని పువ్వే ముద్దు

తెలిసితెలియని మమతే ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

No comments: