Wednesday, May 14, 2008

హాయి హాయిగా ఆమ ని సాగే

హాయి హాయిగా ఆమని సాగే

సోయగాల కనవోయీ సఖా హాయి సఖా (హాయి)


లీలగా పువులు గాలికి ఊగ

సనిదమదనిస
గమగమదనిస
రిసనిదని
సరిసని సరిసని
ద ని ని ద ని ని ద ని
మ ద ద మ ద ద మద
లీలగా ...
కలిగిన తలపుల వలపులు రేగ

ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా (హాయి)



ఏమో ఏమో తటిల్లతిక మేమెరుపో మైమరపేమో

మొయిలురాజు దరి మురిసినదేమో

వలపు కౌగిలుల వాలి సోలి

ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా (హాయి)



చూడుమా చందమామ కనుమా వయ్యారి

శారదయామిని కవ్వించే ప్రేమ

వగల తూలి విరహిణుల మనసున మోహము రేపు నగవుల

ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా (హాయి)



కనుగవ తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా

చెలువము కనుగొన మనసానందనాట్యాలు సేయునోయి (హాయి)




1 comment:

Anonymous said...

choodumaa choodumaa..atu choodu chnadamamaa..