Tuesday, February 5, 2008

మౌనమే నీ భాష

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కల్లలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు

నాటకరంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా


కోర్కెల సెలనీవు కూరిమి వలనీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కల్లలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసాఓ మూగ మనసా


చిత్రం : గుప్పెడు మనసు
గాత్రం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ

1 comment:

Anonymous said...

We are happy to introduce a new BLOG aggregator. http://telugu.blogkut.com. Blogs, news, Videos are aggregated automatically through web. No need to add your blogs to get listed. Have to send a mail to get listed in comments section. Comments section is operating only for Blogspot right now. We welcome everybody to have a look at the website and drop us your valuable comments.

PS: We are looking for an Administrative Team for blogkut. Anybody interested Please drop us a mail at blogkut@gmail.com

Website is BLOGKUT