Tuesday, September 9, 2008

వినిపించని రాగాలే చిత్రం : చదువుకున్న అమ్మాయిలు

వినిపించని రాగాలే, కనిపించని అందాలే
అలలై మదినే కలచే, కలలో ఎవరో పిలిచే
విని............


తొలిచూపులు నాలోనే వెలిగించె దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు
విని .....


వలపే వసంతములా పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలె గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు
విని...................


వికసించెను నా వయసే, మురిపించు ఈ సొగసె
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే

No comments: