Saturday, August 9, 2008

సుందరాంగా అందుకోరా .. చిత్రం : భూకైలాస్

సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమూరగ చెంత చేరరాద
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమూరగ చెంత చేరరాద
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం
చాలు తాపాన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
అట రంగారు బంగారు మీనాలమై చవులూరించు క్రొందేనె జూఱ్ఱాడుదాం
అట రంగారు బంగారు మీనాలమై చవులూరించు క్రొందేనె జూఱ్ఱాడుదాం
తేలాడుదాం ఓలాడుదాం ముదమార తనిదీర ఈదాడుదాం
ముదమార తనిదీర ఈదాడుదాం
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
సుందరాంగా అందుకోరా … సుందరాంగా అందుకోరా ..
సుందరాంగా అందుకోరా … సుందరాంగా అందుకోరా..
సుందరాంగా అందుకోరా .. సుందరాంగా అందుకోరా
సుందరాంగా … సుందరాంగా … సుందరాంగా …

ఓం నమశ్శివాయ … ఓం నమశ్శివాయ .. ఓం నమశ్శివాయ

No comments: