Sunday, August 17, 2008

చక్కని చుక్క సరసకురావే ..చిత్రం : ఇద్దరు మిత్రులు

చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే . . .
టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట
ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే . . .
అల్లరి పిల్లా ఆపవేలా పుల్లవిరుపు మాటలు
పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా
పెళ్ళామంటే బెల్లము తల్లిదండ్రి అల్లము చక్కని . . .
ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయెనే
పెద్దలు గర్జిస్తే పెడసరమవుతావా
పెద్దల గొడవ ఎందుకే ఇద్దరమొకటై ఉందామే చక్కని . . .
మీ నాయనగారి మీసమూ చూస్తేనే సన్యాసము
అబ్బా అబ్బబ్బ నీ మాటలు కొరడాదెబ్బలు
సూటిగా పెళ్ళాడి చాటుగ రానేలా
చేయకు నన్ను దూరము తీయకు మీనా ప్రాణము

No comments: