మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ మాటే మంత్రము మనసే బంధము
నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా పువ్వూ తావిగా
సం యోగాల సంగీతాలు విరిసే వేళలో
మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎద నా కోవెలా ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో
మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓఓ లలలాలల లాలలాలల ఉహు ఉహు హు
No comments:
Post a Comment