Monday, August 4, 2008

ఓ ప్రియురాలా ఓ జవరాలా .. చిత్రం : చక్రపాణి

ఓ ప్రియురాల ఓ జవరాల పలుకవేల నాతో
ఓ ప్రియురాల ఓ జవరాల
ఓ ప్రియురాల ఓ జవరాల పలుకవేలనే నాతో
ఓ ప్రియురాల ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వెన్నెల సెలయేరున విరబూసిన
వెన్నెల సెలయేరున విరబూసిన కలువవు నీవేనే జవరాల
కలువవు నీవేనే జవరాల
నా మదిలో డోలలూగరావే ఓ ప్రియురాల
మిన్నుల పువుదోటల విహరించే
మిన్నుల పువుదోటల విహరించే కిన్నెర నీవేనే జవరాల
కిన్నెర నీవేనే జవరాల
నా మదిలో
నా మదిలో వీణ మీటరావే
నా మదిలో వీణ మీటరావే ఓ ప్రియురాల
పొన్నల నీడలలో నడయాడెడి
పొన్నల నీడలలో నడయాడెడి నెమలివి నీవేనే జవరాల
నెమలివి నీవేనే జవరాల
నా మదిలో
నా మదిలో నాట్యమాడరావే
నా మదిలో నాట్యమాడరావే
ఓ ప్రియురాల ఓ జవరాల పలుకవేల నాతో

No comments: