Thursday, August 14, 2008

నీ ఉండేదా కొండపై నా స్వామి నేనుండే దీ నేలపై చిత్రం : భాగ్య రేఖ

నీ ఉండేదా కొండపై నా స్వామి నేనుండే దీ నేలపై
ఏ లీల సేవింతురో ఏ పూల పూజింతునో
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
ఈ పేదరాలి మనస్సెంతో వేచె
నీ పాదసేవా మహాభాగ్య మీవా
నా పైని దయజూపవా నా స్వామి
నీ
దూరాన నైనా కనే భాగ్యమీవా
నీ రూపునాలో సదా నిల్పనీవా
ఏడుకొండలపైన వీడైన స్వామి
నాపైని దయజూపవా నా స్వామి
నీ


ఈ పాట నే తొలిసారిగా నేర్చుకున్న పాట .అప్పటికి నేను 4 వ తరగతి అనుకుంటా ... అంటే 1958 ప్రాంతంలో ..
ఇంకా గుర్తుంది..కొద్దికొద్దిగా ఆ రోజులు ....:))

No comments: