Sunday, August 17, 2008

ఏమమ్మా నిన్నేనమ్మా ఎలాగున్నావు ..చిత్రం : తేనే మనసులు

ఏమమ్మా!నిన్నేనమ్మా!
ఏలాగున్నావు?
ఏదోలేండి!మీ దయవల్ల
ఈలాగున్నాను
అలాగంటే ఏలాగండి
అయినవాళ్ళని అడిగాము
అంతే లెండి! అంతకు మించి
ఏదో ఏదో వుందని అన్నానా?
నడవకు నడవకు అమ్మయ్యో
నడిచావంటే అమ్మయ్యే
నడుమే నలిగిపోతుంది
నీ నడుమే నలిగిపోతుంది
పొగడకు పొగడకు అమ్మయ్యో
పొగిడారంటే అమ్మయ్యో
మనిషే వెగటైపోతారు
మనిషే వెగటైపోతారు
చూడకు!అలా చూడకు!
చూశావంటే ఏదో ఏదో అవుతోంది
ఎదలో ప్రేమే పుడుతుంది
పుట్టనీ! పాపం పుట్టనీ
ప్రేమే పుడితే పెంచేదాన్ని నేనున్నా
లాలించేదాన్ని నేనున్నా
జోజోజో...జోజోజో



అప్పటి రోజుల్లో అల్లరి చేయటానికి పనికొచ్చిన పాటలు ..
సరికొత్త బహుళ తారాగణం తో హిట్టయిన సినిమా ..

No comments: