Thursday, August 14, 2008

పాడ వొయీ భారతీయుడా చిత్రం :వెలుగునీడలు

పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా2

నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం2
నేడే నవోదయం నీదే ఆనందం
పాడవోయి
చరణం ౧ స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయీ2
సాధించినదానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటోయీ
ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులా2
పాడవోయి
చరణం ౨ ఆకాశం అందుకునే ధర లొక వైపు అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు౨
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకొన్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దు:స్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితి2
పదవీవ్యమోహాలు కులమతభేదాలు భాషాద్వేషాలు చెలరేగే నేడు
ప్రతిమనిషి మరి ఒకరిని దోచుకునేవాడే
స్వార్థమే అనర్థదాయకం అది చంపుకొనుటే క్షేమదాయకం2
సమసమాజనిర్మాణమే నీ లక్ష్యం నీ లక్ష్యం
ఏకదీక్షతో గమ్యం చేరిననాడే లోకానికి మన భారతదేశం
అందించునులే శుభసందేశం

No comments: