Sunday, August 17, 2008

చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు chitram వెలుగునీడలు,

చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు
చల్లని
పడికిలి మూసిన చేతులు లేత గులాబీ రేకులు2
చెంపకు చారెడు సోగకన్నులె సంపదలీనెడు జ్యోతులు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు
చల్లని
ఇంటను వెలసిన దైవము కంటను మెరిసిన దీపము
మా హృదయాలకు హాయి నొసంగే పాపాయే ప్రాణము
మా పాపాయి నవ్వుపువ్వులే మంచి ముత్యముల వానలు
చల్లని
నోచిన నోముల పంటగా అందరి కళ్ళకు విందుగా2
పేరుప్రతిష్టలే నీ పెన్నిధిగా నూరేళ్ళాయువు పొందుమా
మా పాపాయి నవ్వుపువ్వులే మంచి ముత్యముల వానలు
చల్లని

No comments: