Monday, August 4, 2008

పయనించే ఓ చిలుకా .... చిత్రం : కులదైవం

పయనించే ఓ చిలుకా
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకాతీరెను రోజులు నీకీ కొమ్మకు పొమ్మా ఈచోటు వదలీ
తీరెను రోజులు నీకీ కొమ్మకు పొమ్మా ఈచోటు వదలీ
ఎవరికి వారే ఏదోనాటికి ఎరుగము యెచకో ఈ బరివీ
మూడు దినాలా ముచ్చటయే
మూడు దినాలా ముచ్చటయే ఈ లోకములో మన మజిలీ
నిజాయితీగా ధర్మపధానానిజాయితీగా ధర్మపధానా చనుమా ధైర్యమె తోడూ
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా
పుల్లా పుడకా ముక్కున కరచి గూడును కట్టితివోయీ
పుల్లా పుడకా ముక్కున కరచి గూడును కట్టితివోయీ
వానకు తడిసిన నీ బిగిరెక్కలు యెండకు ఆరినవోయీ
ఫలించలేదని చేసిన కష్టమూ
ఫలించలేదని చేసిన కష్టమూ మదిలో వేదన వలదోయీ
రాదోయీ సిరి నీవెనువెంటా
రాదోయీ సిరి నీవెనువెంటా త్యాగమే నీచేదోడూ
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా
మరవాలీ నీ కులుకులనడలే మదిలోనయగారాలే
మరవాలీ నీ కులుకులనడలే మదిలోనయగారాలే
తీరనివేదన తీయనిముసుగే సిరసున సింగారాలే
ఓర్వలేని ఈ జగతికి నీపై
ఓర్వలేని ఈ జగతికి నీపై లేదే కనికారాలే
కరిగీ కరిగీ కన్నీరై
కరిగీ కరిగీ కన్నీరై కడ తేరుట నీ తలవ్రాలే
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా
భోడుమనీ విలపించేరే నీ గుణమూ తెలిసినవారూ
భోడుమనీ విలపించేరే నీ గుణమూ తెలిసినవారూ
జోడుగనీతో ఆడీ పాడీ కూరుములాడిన వారు
ఏరులయే కన్నీరులతో మనసార దీవించేరే
యెన్నడో తిరిగి ఇటు నీరాక యెవడే తెలిసిన వాడు
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా

No comments: