Tuesday, September 9, 2008

నందామయా గురుడ నందామయా ..చిత్రం : పెద్ద మనుషులు

నందామయా గురుడ నందామయా

ఆనంద దేవికి నందామయా

స్వరాజ్య యుద్దాన జయభేరి మ్రోగించి

శాంత మూర్తులు అంతరించారయా

స్వాతంత్ర గౌరవం సంతలో తెగనమ్మి

స్వార్థమూర్తులు అవతరించారయా


వారు వీరులవుతారు

మిట్ట పల్లాలు ఏకమవుతాయయా

తూరుపు దిక్కున తోకచుక్క పుట్టి

పెద్ద ఘటముల కెసరు పెట్టేనయా

కనకాద్రి శిఖరాన శునకమ్ము సింహమై

ఏడు దీవులు రాజ్యమేలెనయ్యా

గుళ్ళు మింగేటోళ్ళూ జేబుకొట్టేటోళ్ళు

ఊళ్ళలో చెలామణి అవుతారయా


అ ఆ లు రానట్టి అన్నయ్యలందరికీ

అధికార యోగమ్ము పడుతుందయా

కుక్క తోక పట్టి గోదావరీదితే

కోటిపల్లి కాడ తేలేరయ్యా


గొర్రెల్ని తినువాడు గోవింద కొడతాడు

బర్రెల్ని తినువాడు వస్తాడయా

పగలు చుక్కను మింట మొలిపింస్తనంటాడు

నగుచాట్లు పడి తోక ముడిచేనయా

దుక్కి దున్నేవాడు భూమి కామందునని

అద్దెకుండేవాడు ఇంటి కామందునని

ఆందోళనల లేవతీస్తాడయా


ఆంబూరు కాడ ఆటంబాంబు బద్దలయి

తుంబ తుంబగ జనుల చచ్చేరయా

తిక్క శంకర స్వామి చెప్పింది నమ్మితే

చిక్కులన్నీ తీరిపోతాయయో ...


No comments: